PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జ‌గ‌న‌న్న వ‌స్తున్నాడు.. కార్లు జాగ్ర‌త్త !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీలోని తిరుప‌తి నగరంలో జనసేన వినూత్నంగా నిర‌స‌న తెలిపింది. ఒక బ్యానర్ ఏర్పాటు చేసుకుని ‘జగన్ అన్న వస్తున్నాడు.. కార్లు జాగ్రత్త’ అంటూ ఫ్లెక్సీ పెట్టి నాయకులు నిరసన వ్యక్తం చేస్తూ.. దండోరా వేస్తున్నారు. ఈ సందర్భంగా జనసేన నేతలు మాట్లాడుతూ రెండు, మూడు రోజుల్లో సీఎం జగన్ తిరుపతి పర్యటనకు వస్తున్నారని అన్నారు. కాన్వాయ్‌లకు సంబంధించి ట్రాన్స్‌పోర్టుకు ఇప్పటికే దాదాపు రూ. 2 కోట్లు బకాయి ఉన్నారని, దీంతో ట్రాన్స్ పోర్టు వాహనాలు పెట్టే పరిస్థితి లేదని అన్నారు. మొన్న ఒంగోలులో చేసినట్లు తిరుపతిలో ఉన్న స్థానికుల వాహనాలు తీసుకుని, కాన్వాయ్‌లుగా వాడుకునే అవకాశముందని, అందుకే ముందు జాగ్రత్తగా హెచ్చరికలు చేస్తున్నామని అన్నారు.

                                               

About Author