వాహనాల తనిఖీ.. నాగలూటిలో గ్రామసభ
1 min readపల్లెవెలుగు వెబ్, మిడుతూరు: మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం నందికొట్కూరు నంద్యాల జాతీయ రహదారిలో సిబ్బందితో కలసి ఎస్ ఐ జి.మారుతిశంకర్ వాహనాలను తనిఖీ చేశారు. బైకులపైన త్రిబుల్ రైడింగ్ చేయకూడదని,ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని,ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదని ఎస్సై వాహనదారులకు తెలిపారు.అధేవిధంగా వాహనాలకు ఎక్కువ పెండింగ్లో ఉన్న చలానాలు చెల్లించాలని ఆయన అన్నారు. సరైనపత్రాలు లేని 10 వాహనదారులకు 2050 రూపాయలు జరిమానా విధించారు.తదనంతరం నాగలూటి గ్రామంలో గ్రామ ప్రజలతో గ్రామసభ నిర్వహించారు. ఒకరినొకరు కొట్టుకోవడం వలన కలిగే నష్టాల గురించి గ్రామ ప్రజలకు ఆయన తెలియజేశారు.ఈకార్యక్రమంలో ఏఎస్ఐ సుబ్బయ్య,హెడ్ కానిస్టేబుల్ హనుమంతు,హి మాంస తదితర సిబ్బంది పాల్గొన్నారు.