గూగుల్ సంచలనం.. 12 లక్షల యాప్స్ ?
1 min readపల్లెవెలుగువెబ్ : గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇన్‌స్టంట్ లోన్ యాప్స్‌తో జనాల్ని పీక్కుతింటున్న యాప్‌లను గూగుల్ గుర్తించింది. అలాంటి మోసపూరిత, సేఫ్ కానీ యాప్‌లపై చెక్ పెట్టింది. ఇందులో భాగంగా 12లక్షల యాప్స్‌ను నిషేధించింది. దీంతో పాటు స్పామ్ డెవలపర్స్‌గా అనుమానిస్తున్న 2లక్షల యాప్స్‌ను, ఇన్ యాక్టీవ్‌గా ఉన్న మరో 5లక్షల యాప్స్‌ను నిలిపివేసింది. బ్లాక్ చేసిన యాప్స్ తమ విధానాలకు విరుద్ధంగా ఉన్నాయని వెల్లడించింది. తమ యూజర్ల సెక్యూరిటీకి భరోసా ఇచ్చేలా వాటిని ప్లే స్టోర్ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.