ఫాస్టాగ్ విధానం కనుమరుగు !
1 min readపల్లెవెలుగువెబ్ : ఫాస్టాగ్ విధానం త్వరలో కనుమరుగు కానుంది. దాని స్థానంలో ఉపగ్రహ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థను పరిచయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్ప టికే ఐరోపా దేశాల్లో ఉపగ్రహ ఆధారిత గ్లోబల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టం అందుబాటులో ఉంది. ఈ వ్యవస్థ వల్ల వాహనదారుల కూ వెసులుబాటు కలగనుంది. ప్రస్తుతం టోల్‌ప్లాజాల వద్ద సంబంధిత నిర్వహణ సంస్థ టోల్ రోడ్ ప్రారంభం నుంచి ముగింపు దాకా కిలోమీటర్లను లెక్కగట్టి ట్యాక్స్‌ను వసూలు చేస్తున్నారు. అంటే.. వాహనదారులు టోల్ రోడ్‌ను 10 కిలోమీటర్లే వినియోగించుకున్నా మొత్తం ట్యాక్స్ చెల్లిస్తున్నారు. జీపీఎస్ ఆధారంగా పనిచేసే జీఎన్ఎస్ఎస్ లో వాహనదారుడు టోల్ రోడ్‌పై ప్రయాణించిన దూ రానికే టోల్‌ట్యాక్స్ చెల్లించాలి.