దేశంలో నిరుద్యోగం పెరిగింది !
1 min readపల్లెవెలుగువెబ్ : దేశంలో నిరుద్యోగం రేటు పెరిగింది. మార్చి నెలతో పోల్చితే ఏప్రిల్‌లో ఇది 7.6 శాతం నుంచి 7.83 శాతానికి పెరిగిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ తాజా గణాంకాలు తెలుపుతున్నాయి. నిరుద్యోగం పట్టణ ప్రాంతాల్లో 9.22 శాతం, పల్లె ప్రాంతాల్లో 7.18 శాతం ఉన్నట్టు సీఎంఐఈ పేర్కొంది. మార్చిలో పట్టణ ప్రాంతాల నిరుద్యోగం 8.28 శాతం ఉండగా పల్లె ప్రాంతాల్లో 7.29 శాతం ఉంది. రాష్ర్టాలవారీగా చూస్తే నిరుద్యోగం హరియాణాలో అత్యధికంగా 34.5 శాతం ఉండగా 28.8 శాతంతో రాజస్థాన్, 21.1 శాతంతో బిహార్, 15.6 శాతంతో జమ్ముకశ్మీర్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.