మహిళ అదృశ్యం.. కేసు ఛేదించిన మహానంది పోలీసులు
1 min readపల్లెవెలుగు వెబ్, మహానంది: ఓ అదృశ్యమహిళ కేసు ఛేదించినట్లు మహానంది ఎస్ ఐ నాగార్జున్ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది మార్చి 14వ తేదీన తెలంగాణ రాష్ట్రానికి చెందిన నాగమ్మ (40)తమ కుటుంబ సభ్యులతో మహానంది క్షేత్రానికి వచ్చి అదృశ్యమైనట్లు కేసు నమోదు అయిందని మహానంది ఎస్ ఐ నాగార్జున రెడ్డి తెలిపారు . నల్లమల అటవీ ప్రాంతంలో మృతదేహాన్ని గుర్తించి మృతురాలి బంధువులకు సమాచారంఅందించి వారి సమక్షంలో .పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు .మృతురాలు తెలంగాణకు చెందిన నారాయణపేట జిల్లా అంతర్వేదగ్రామం నాకు చెందిన మహిళలగాఎస్ ఐ నాగార్జున రెడ్డి పేర్కొన్నారు ..అదృశ్యం కేసుకు సంబంధించి సహకరించిన సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.