ముగిసిన పల్లె పోరు..
1 min read– 12 వైసీపీ.. మూడు టీడీపీ.. ఒకటి ఇండిపెండెంట్
పల్లెవెలుగు,గడివేముల;
పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలంలోని 16 గ్రామపంచాయతీలకు శనివారం రెండో విడత ఎన్నికలు జరిగాయి. ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్చగా వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచి భారీ క్యూ కట్టిన ఓటర్లు.. మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఓట్లు వేశారు. వృద్ధులు, వికలాంగులు, ఆరోగ్యం సరిగా లేని వారికి.. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు, వాలంటీర్లు సహాయం చేశారు. 16 గ్రామపంచాయతీలలో 12 వైసీపీ, మూడు టీడీపీ, ఒకటి ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. ఆయా గ్రామపంచాయతీలలో గెలుపొందిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. గడివేముల గ్రామపంచాయతీ ఎ. రమణమ్మ (టీడీపీ) 661 మెజార్టీతో గెలువగా.. బూజునూరులో వై. రాములమ్మ ( వైసీపీ) 263, గడిగారేవుల రామ్మోహన్ రెడ్డి (వైసీపీ)371 , తిరుపాడు )బాల లింగమ్మ (వైసీపీ) 84 , కోరటమద్ది (5)నాగేశ్వర్ రెడ్డి (వైసీపీ) 240, కే.బొల్లవరం వై. అంజనమ్మ (వైసీపీ) 41 , కొర్రపోలురులో మాలిక్బాష ( ఇండిపెండెంట్ ) 44, మంచాలకట్ట లో మూసానీ వెంకటరమణ (వైసీపీ) 243, గని కత్తి తులసమ్మ( వైసీపీ) 537 , ఎల్ కే తాండ బి. లక్ష్మి బాయ్ వైసీపీ ) 132 , ఓండుట్లలో గంగాధర్ రెడ్డి (టీడీపీ ) 37, పెసరవాయిలో ఎర్రగుడి శేఖర్ ( వైసీపీ) 102 మెజారిటీ, కరిమద్దెలలో కుమ్మరి సుంకన్న ( వైసీపీ) 600 ,దుర్వేసిలో ఎం. మమత ( వైసీపీ) 102 ,బిలకలగూడూరులో మల్లెపోగు పెద్ద నారాయణ( వైసీపీ) 548, చిందుకూరు పల్లపు రెడ్డి అనసూయమ్మ( టీడీపీ) 188 మెజారిటితో గెలుపొందారు.