NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఒకే ఇంట్లో ఆరుగురి హ‌త్య: కిరాత‌క చ‌ర్య

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: విశాఖ జిల్లా పెందుర్తిలో దారుణం జ‌రిగింది. పెందుర్తి మండ‌లం జుత్తాడ‌లో ఓకే ఇంట్లో ఆరుగురు కుటుంబ స‌భ్యుల‌ను అత్యంత కిరాత‌కంగా హ‌త‌మార్చారు. మృతుల్లో 2 సంవ‌త్సరాలు బాబు, 6 నెల‌ల పాప ఉన్నారు. జుత్తాడ‌కు సంబంధించిన బ‌త్తిన అప్పల‌రాజు ఈ కిరాత‌కానికి పాల్పడ్డాడు. బొమ్మిడి ర‌మ‌ణ‌, బ‌త్తిన అప్పల‌రాజు కుటుంబానికి కొన్ని రోజులుగా ఘ‌ర్షణ జ‌రుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇంట్లో నిద్రిస్తున్న బొమ్మిడి ర‌మ‌ణ కుటుంబ స‌భ్యుల‌ను అప్పల‌రాజు వేట‌కొడ‌వ‌లితో .. ఆడ‌,మ‌గ‌, పిల్లా,పాప అనే తేడా లేకుండా న‌రికి చంపాడు. ఈఘ‌ట‌న‌తో జుత్తాడ ఉలిక్కప‌డింది. గ్రామంలో విషాద చాయ‌లు అలుముకున్నాయి. నిందితుడు బ‌త్తిన అప్పల‌రాజు పోలీసుల ఎదుట లొంగిపోయిన‌ట్టు స‌మాచారం. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని విచారిస్తున్నారు

About Author