నేరాలు ఏపీలోనే ఎక్కువ !
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీలోనే ఎక్కువ నేరాలు జరుగుతున్నట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ చెబుతున్నాయని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఏపీలో మహిళలపై నేరాలు 2019లో 10వ స్థానంలో ఉంటే.. 2020లో 8వ స్థానానికి చేరిందని మండిపడ్డారు. ఏపీలో ప్రతి 3 గంటలకు దళితులపై దాడులు జరుగుతున్నాయని చెప్పారు.గంజాయి, లిక్కర్ వల్లే క్రైమ్ రేట్ పెరుగుతోందన్నారు. రేషన్ షాపుల్లో బియ్యం తప్ప ఏమైనా దొరుకుతున్నాయని ఎద్దేవా చేశారు. 175 సీట్లు రావాలంటే వైసీపీ, ప్రభుత్వం ప్రక్షాళన జరగాలని ఎంపీ రఘురామ కృష్ణరాజు వ్యాఖ్యానించారు.