హిందీ చాలా మంచి భాష !
1 min readపల్లెవెలుగువెబ్ : హిందీ భాష పై ప్రముఖ నటి సుహాసిని కీలక వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్ లో పాల్గొన్న సుహాసిని హిందీ చాలా మంచి భాషని చెప్పారు. హిందీ మాట్లాడేవారు కూడా మంచి వారని ఆమె మెచ్చుకున్నారు. హిందీ జనాలతో మాట్లాడాలంటే వారి భాష నేర్చుకోవాల్సిందేనన్నారు. అయితే, తమిళులు కూడా మంచి వారని సుహాసిని చెప్పారు. హిందీ ప్రజలు తమిళం నేర్చుకుంటే సంతోషమేనని సుహాసిని తన మనసులో మాట బయటపెట్టారు. మొత్తం మీద, అన్ని భాషలు మంచివే… ఎన్ని ఎక్కువ భాషలు నేర్చుకుంటే అంత మేలని ఆమె అంటున్నారు.