ఉక్రెయిన్ లో తక్షణం కాల్పుల విరమణ జరగాలి !
1 min readపల్లెవెలుగువెబ్ : ఉక్రెయిన్‌లో తక్షణం కాల్పుల విరమణ జరగాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ అభిలషించారు. ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షోభానికి తెరచిందేందుకు ఈ అంశంతో ప్రమేయమున్న ప్రతి ఒక్కరూ శాంతి, దౌత్య మార్గాన్ని అనుసరించాలని విజ్ఞప్తి చేశారు. డేనిష్ ప్రధాని మెట్టె ఫ్రెడరిక్‌సెన్‌తో ద్వైపాక్షిక చర్యల అనంతరం మీడియాతో మోదీ మాట్లాడుతూ, ఇండియా-యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్‌కు సంబంధించిన సంప్రదింపులు సాధ్యమైనంత త్వరగా ముగుస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇండియాలోని ఇన్‌ఫ్రా, గ్రీన్ సెక్టార్లలో డేనిష్ సంస్థలు పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలున్నాయని చెప్పారు.