జీలకర్ర ధరలు భారీగా పెరగనున్నాయా ?
1 min readపల్లెవెలుగువెబ్ : జీలకర్ర ధరలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. తక్కువ విస్తీర్ణంలో సాగు, భారీ వర్షాల కారణంగా దేశవ్యాప్తంగా 2021-2022-నవంబరు-మేలో జీలకర్ర ఉత్పత్తి 35శాతం మేర పడిపోయింది. ఫలితంగా యాసంగిలో 5,580 లక్షల టన్నుల మేర మాత్రమే ఉత్పత్తి జరగనుంది. దీంతో ఇప్పుడున్న జీలకర్ర ధర 30-35శాతం మేర పెరిగి కిలోకు రూ.165-170కి చేరుకునే అవకాశాలున్నాయి. ఈ మేరకు క్రిసిల్ నివేదిక వెల్లడించింది. 2021-2022 యాసంగిలో జీలకర్ర సాగులో 21 శాతం క్షీణత నమోదైందని, కేవలం 9.83 లక్షల హెక్టార్లలోనే సాగైందని నివేదిక పేర్కొంది. పంట ఎందుకు తక్కువగా సాగైంది? అనే దానిపైనా క్రిసిల్ నివేదిక విశ్లేషించింది. జీలకర్ర పంట విత్తే సమయంలో అంటే 2021 అక్టోబరు-డిసెంబరు మధ్య ఆవాల ధర 43శాతం, పప్పు ధాన్యాల ధర రూ.35శాతం పెరిగాయని.. ఫలితంగా ఆ రైతులు, ఆవాలు, పప్పు ధాన్యాల సాగువైపు మళ్లారని నివేదిక పేర్కొంది.