ఇసుక సంక్షోభం పై హెచ్చరిక !
1 min readపల్లెవెలుగువెబ్ : ఇసుక సంక్షోభం పై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఇసుక తయారయ్యేందుకు వందల, వేల ఏళ్ల సమయం పడుతుందని, అలాంటి అరుదైన వనరును విచ్చలవిడిగా వినియోగించడం పట్ల కెన్యా కేంద్రంగా పనిచేసే ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం తాజాగా ఓ నివేదికలో గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఇసుక వినియోగం గత రెండు దశాబ్దాల్లో మూడింతలు పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఏడాదికి 50 బిలియన్ టన్నులు ఇసుక వినియోగం జరుగుతోంది. ఇలానే కొనసాగితే నదులు, తీర ప్రాంతాల మనుగడకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందని, కొన్ని దీవులు తుడిచిపెట్టుకుపోయినా ఆశ్చర్యం లేదని నివేదిక హెచ్చరించింది. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడటంలో ఇసుక ప్రధాన పాత్ర పోషిస్తుంది. భారీ తుపానులు వచ్చినప్పుడు వెల్లువెత్తే వరదల తీవ్రతను నియంత్రిస్తుంది. వర్షపు నీరు వృధాగా పోకుండా చినుకు పడ్డచోటే ఇంకేలా చేస్తుంది. తద్వారా భూగర్భజల మట్టం పడిపోకుండా ఉంటుంది
అని నివేదిక పేర్కొంది.