గ్యాస్ సిలిండర్ కు ఎక్స్పైరీ డేట్ ఉంటుందని తెలుసా ?
1 min readపల్లెవెలుగువెబ్ : చాలా మందికి గ్యాస్ సిలిండర్ కు కాలపరిమితి ఉంటుందని తెలియదు. గ్యాస్ సిలిండర్‌కు ఉండే కాలపరిమితిని సాధారణంగా ఎవరూ గమనించరని, కాలపరిమితి దాటితే పెనుప్రమాదం ఉంటుందని పలువురు నిపుణులు చెబుతున్నారు. గ్యాస్ సిలిండర్ ఎక్స్‌పైరీ తేదీ ముగిసినా వినియోగిస్తే గ్యాస్ లీయయ్యే ప్రమాదం ఉందంటున్నారు. సరఫరా చేసే ప్రతి సిలిండర్‌పై ఎక్స్‌పైరీ సంవత్సరాన్ని, నెలను కోడ్ విధానంలో మెటల్ ప్లేట్‌పై వంటగ్యాస్ కంపెనీలు ముద్రిస్తాయి. సిలిండర్ మారుతున్నప్పుడల్లా ఎక్స్‌పైరీ గడువును చూసుకుని తీసుకోవడం, వినియోగించుకోవడం ఎంతో అవసరమని హితవు పలుకుతున్నారు. సిలిండర్ తయారైన నాటి నుంచి పదేళ్ల వరకు దానికి గడువు ఉంటుంది. సిలిండర్‌ను ప్రత్యేకమైన ఉక్కుతో, లోపల భాగం సురక్షితమైన కోటింగ్‌తో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ ప్రమాణాలతో తయారుచేస్తారు. బీఐఎస్ అనుమతుల తరువాతే సిలిండర్ మార్కెట్‌లోకి వస్తుంది.