బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించిన ఉత్తర కొరియా !
1 min readపల్లెవెలుగువెబ్ : ఉత్తర కొరియా తూర్పు తీరం దిశగా మరోసారి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం చేపట్టినట్టు దక్షిణ కొరియా మిలటరీ తెలిపింది. నార్త్ కొరియా రాజధాని ప్యాంగ్‌యాంగ్‌కు సమీపంలో ఉన్న సనన్ నుంచి ఈ క్షిపణి ప‍్రయోగం జరిగినట్టు వెల్లడించింది. దీంతో మరోసారి కిమ్ జోంగ్ ఉన్ దక్షిణకొరియా, అమెరికా, జపాన్‌లను ఆందోళనకు గురిచేశారు. కాగా, ఈ ఏడాదిలో ఇది 14వ క్షిపణి ప్రయోగం కావడం గమనార్హం. ఏప్రిల్ 25వ తేదీన జరిగిన మిలిటరీ పరేడ్ తర్వాత జరిగిన తొలి క్షిపణి పరీక్ష ఇదే కావడం విశేషం. మరోవైపు అణ్వాయుధాలను మరింత వేగవంతంగా సేకరించనున్నట్లు ఆ పరేడ్ సమయంలో కిమ్ జాంగ్ ఉన్ ప్రకటించిన తర్వాత ఇలా క్షిపణి ప్రయోగం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.