కరోన వైరస్ గాలిలో ఉంటుందా.. పరిశోధనలో ఏం తేలిందంటే ?
1 min readపల్లెవెలుగువెబ్ : కరోనా వైరస్ గాలిలో ఉండగలదని, గాలి ద్వారా వ్యాపించగలదనడానికి సరైన ఆధారాలను సీఎస్‌ఐఆర్–సీసీఎంబీ హైదరాబాద్, సీఎస్‌ఐఆర్–ఇమ్‌టెక్ చండీగఢ్ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందుకోసం కోవిడ్–19 చికిత్స అందించిన ఆస్పత్రులు, కోవిడ్–19 రోగులను ఉంచిన గదులు, హోం ఐసోలేషన్ పాటించిన కోవిడ్–19 రోగులున్న గదుల నుంచి గాలి నమూనాలను సేకరించి పరిశోధన చేశారు. ఈ క్రమంలో గాలిలో వైరస్ ఉన్నట్లు జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా కనుగొన్నారు. కరోనా రోగులున్న పరిధిలో వైరస్ గాలిలోకి వ్యాపిస్తోందని, ఇతరులు ఆ పరిధిలోకి వెళ్తే వైరస్ బారిన పడతారని అంచనాకు వచ్చారు. గదిలో ఇద్దరి కన్నా ఎక్కువ మంది రోగులున్న చోట కోవిడ్–19 పాజిటివిటీ రేటు 75 శాతం ఉందని.. ఒకరు ఉన్నా లేదా రోగులు వెళ్లిపోయిన తర్వాత ఖాళీ చేసిన గదిలో పాజిటీవిటీ రేటు 15.8 శాతంగా ఉందని కనుగొన్నారు.