ఏపీ.. రెండు నెలల్లో ఎన్ని బీర్లు అమ్ముడుపోయాయో తెలుసా ?
1 min readపల్లెవెలుగువెబ్ : మద్యం ప్రియులు రూటు మార్చేస్తున్నారు. లిక్కర్‌ను ఎక్కువగా ఇష్టపడే ఆంధ్రప్రదేశ్ వినియోగదారులు ఎండల దెబ్బకు బీరు తాగేందుకు ఇష్టపడుతున్నారు. కేవలం రెండు నెలల్లో 5లక్షల కేసుల బీరు అమ్మకాలు పెరుగుదలే దీనికి నిదర్శనం. ఈ ఏడాది జనవరిలో 6.87లక్షల కేసుల బీరు అమ్మగా, ఫిబ్రవరిలో 7.10లక్షల కేసులు, మార్చిలో 10.33లక్షల కేసులు, ఏప్రిల్‌లో 12.51లక్షల కేసులు అమ్మారు. ఫిబ్రవరితో పోలిస్తే ఏప్రిల్‌లో ఒకేసారి 5లక్షల కేసుల బీరు అమ్మకాలు రాష్ట్రంలో పెరిగాయి. ఈ క్రమంలో లిక్కర్ అమ్మకాలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. మార్చిలో 2.68లక్షల కేసుల లిక్కర్ అమ్మితే ఏప్రిల్‌లో అది 2.36లక్షల కేసులకు తగ్గిపోయింది. వచ్చే నెలలో ఇంకా తగ్గుతాయని భావిస్తూ.. అందుకు అనుగుణంగా బీరు స్టాకులో కొరత లేకుండా ఎప్పటికప్పుడు షాపులు, బార్లకు సరఫరా చేస్తున్నారు.