వన్యప్రాణుల వేటకు అడ్డా.. ‘చలమ రేంజ్’
1 min readపల్లెవెలుగు వెబ్, మహానంది: నల్లమల అటవీ ప్రాంతంలోని .చలమ రేంజ్ వన్యప్రాణుల వేట కు అడ్డాగా మారినట్లు విశ్వసనీయ సమాచారం .గత కొంతకాలం నుంచి చలమ రేంజ్ మరియు చలమ బిట్ల యందు వన్యప్రాణుల వేటయదేచ్ఛగా కొనసాగుతున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి .గత కొన్ని రోజుల క్రితం వన్యప్రాణి ఒకదానిని నాటు తుపాకితో కాల్చి చంపినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి .ఇలాంటి సంప్రదాయం గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతున్న అడవి శాఖ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినవస్తున్నాయి .ప్రస్తుతం ఉన్న అటవీ శాఖ డి ఎఫ్ ఓ వచ్చిన తర్వాత కొంత తగ్గుముఖం పట్టిన కొన్ని సంఘటనలు చోటు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది .గత కొన్ని నెలల క్రితం చలమ రేంజ్ లోని పెద్ద కమ్మలూరు బీట్ నందు ఒక పులి నీ చెప్పితే అది బయట పడకుండా ఉండేందుకు అటవీ శాఖలోని కొందరు సిబ్బంది గుట్టుచప్పుడు కాకుండా నామరూపాలు లేకుండా చేయాలని తలచారు .కానీ అది బయటికి పొక్కడంతో ఇద్దరు తాత్కాలిక ఉద్యోగుల తో పాటు ఇద్దరు ఉద్యోగులు సస్పెండ్ అయ్యారు .రెండు నెలలు పూర్తిగా అవ్వకుండానే మరల విధుల్లోకి తీసుకో పోతున్నారని ప్రచారం .ఇదే నిజమైతే ప్రజల్లో అటవీశాఖ అధికారులపై చులకన భావన ఏర్పడే అవకాశం ఉన్నట్లు సమాచారం .చలమ రేంజిలో చలమ బీట్ నందు గతంలో ఫారెస్ట్ అధికారులువన్యప్రాణుల వేటగాళ్ల నుంచి ఎనిమిది నాటు తుపాకులను మరియు 18 మందిని అరెస్టు చేసి కేసు నమోదు చేయడం జరిగింది .బసాపురం బీట్ నందు స్వాధీనం చేసుకున్న నాటు తుపాకులు ఉన్నట్లు తెలుస్తుంది .గాజులపల్లె గాజులపల్లి ఆర్ఎస్ ,బసాపురం ,చలమ తదితర ప్రాంతాల్లో వేటగాళ్లు అధిక సంఖ్యలో ఉన్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి .మహానంది పోలీస్ స్టేషన్ లో కూడా వన్యప్రాణుల వేట కు సంబంధించి బసాపురం మరియు గాజులపల్లె తదితర గ్రామాల్లో దాడులు నిర్వహించిదాదాపు 12 నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు కేసులు నమోదయ్యాయి ..ఎన్ని జరుగుతున్నా చలమ రేంజి ఆరెంజ్ బీటు యందు పనిచేస్తున్న సిబ్బంది లో మార్పు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. గత ఆరేడేళ్ల నుంచి ఒక అటవీశాఖ ఉద్యోగి అక్కడ పని చేస్తుండడం పలు విమర్శలకు తావిస్తోంది. వీటన్నిటికీ మూల సూత్రధారి అతడే నని ఆరోపణలు వస్తున్నాయి .ఉన్నత స్థాయి అధికారులను కూడా పక్కదోవ పట్టిస్తూ నట్లు విమర్శలు వినవస్తున్నాయి .కిందిస్థాయి నుంచి వచ్చిన ఆ ఉద్యోగి ఆరెంజ్ లో చక్రం తిప్పుతూ ఉన్నాడనే ప్రచారం జరుగుతున్నట్లు తెలుస్తుంది .ఆ ఉద్యోగి విచారిస్తే పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూసే అవకాశం ఉన్నట్లు సమాచారం .శివుని ఆజ్ఞ లేకుండా చీమైనా కూడా కలదు అన్న విధంగా ఆ ఉద్యోగి తెలియకుండా ఆరెంజ్ లో ఏమి జరగదని అయినా ఏమి బహిర్గతం అయ్యే అవకాశం లేదని ఆరోపణలు వినవస్తున్నాయి .ఆరెంజ్ లోని నెమల్ల జాడ ,పాత బొగదా దీనికి అనుసంధానమై ఉన్నాయి .పక్క జిల్లాకు అనుసంధానంగా ఉండడంతో ఆడింది ఆట పాడింది పాటగా మారినట్లు సమాచారం.