వైసీపీ బాదుడుపై… టీడీపీ ఇంటింటి ప్రచారం
1 min readపల్లెవెలుగువెబ్: నంద్యాల జిల్లా మహానంది మండలం గోపవరం గ్రామంలో వైసీపీ బాధితుడు పాలనపై ఇంటింటి ప్రచారం నిర్వహించారు .వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కరెంట్ చార్జీలు మరియు ఆర్టీసీ చార్జీలు పెంపుదల ఉండదని చెప్పి పేద ప్రజల నడ్డి విరుస్తున్నారని టిడిపి నాయకులు ఆరోపించారు .నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని రైతులకు గిట్టుబాటు లేదని ఇవన్నీ ఆలోచించుకొని రాబోవు ఎన్నికలలో టిడిపి పట్టం కట్టాలని టిడిపి నాయకులు గోపవరం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు .శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో క్రాంతి కుమార్ యాదవ్ ,రాముడు ,టిడిపి నాయకులు పాల్గొన్నారు.
,