రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించండి: కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్
1 min readపల్లెవెలుగు వెబ్ : నంద్యాల జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో నిత్యం డాక్టర్లు అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ ఆదేశించారు. బుధవారం నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు అవసరమైన అన్ని మందులు, పరికరాలు సిద్ధంగా ఉంచుకుని రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు. నీటి పైపులైన్ల మరమ్మతులు, ఎలక్ట్రీషియన్ పనులు, వైద్య పరికరాల మరమ్మతులు అందుబాటులో ఉన్న నిధుల నుండి చేయించుకుని రోగులకు అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆదేశించారు. ఆరోగ్యశ్రీ లేదా ఆస్పత్రి అభివృద్ధి నిధులను వినియోగించుకొని రోగులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా నిత్యం రోగులకు అందుబాటులో వుండి వైద్యం చేయాలన్నారు. ఆసుపత్రిలోని పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మెడికల్ సూపరింటెండెంట్ కలెక్టర్ ఆదేశించారు. ఆసుపత్రిలో ఎన్ని వార్డులు ఉన్నాయి… ఎంత మంది వైద్య సిబ్బంది ఉన్నారని తదితర వివరాలను సూపరింటెండెంట్ ను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఎం సి హెచ్ బ్లాక్, అత్యవసర చికిత్సా విభాగంలో రోగులకు అందుతున్న వైద్యసేవలపై కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ ఎం విజయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ, ఆస్పత్రి వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.