భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్
1 min readపల్లెవెలుగువెబ్ : భారత స్టాక్ మార్కెట్ బేర్స్ పట్టులోకి వెళ్లింది. ఉదయం నుంచే సూచీలు భారీ గ్యాప్ డౌన్ తో ప్రారంభమయ్యాయి. అనంతరం అదే బాటలో కొనసాగాయి. యూఎస్ మార్కెట్లలో నెలకొన్ని భారీ అమ్మకాల ఒత్తిడి భారత మార్కెట్ ను కూడ తాకింది. అమెరికా ఆర్థిక వ్యవస్థలో స్టాగ్ ప్లేషన్ ముప్పు ఉందన్న వార్తల నేపథ్యంలో సెంటిమెంట్ ను దెబ్బతీసింది. అదే సమయంలో ద్రవ్యోల్బణం రెండంకెలను చేరుకునే అవకాశం ఉందన్న భయంతో సూచీలు భారీ కరెక్షన్ కు గురయ్యాయి. మధ్యాహ్నం 1 గంట సమయంలో సెన్సెక్స్ 1000 పాయింట్లు నష్టపోయి 54706 వద్ద, నిప్టీ 313 పాయింట్ల నష్టంతో 16369 వద్ద ట్రేడ్ అవుతోంది.