‘రెవెన్యూ’ పర్యవేక్షణలో… రేషన్ పంపిణీ చేయాలి: జేసీ
1 min readపల్లెవెలుగు వెబ్: కార్డుదారులకు సక్రమంగా రేషన్ పంపిణీ అయ్యేలా రెవెన్యూ అధికారులు పర్యవేక్షణ చేయాలని జాయింట్ కలెక్టర్ రామ సుందర్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఆర్డిఓలు, తహసీల్దార్లలతో పిఓఎల్ఆర్, గడువు దాటి పరిష్కరించని స్పందన అర్జీలు,రేషన్ పంపిణీ, భూసేకరణ తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్ రామ సుందర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ ను త్వరితగతిన పూర్తి చేయాలని జేసీ ఆదేశించారు.. స్పందన అర్జీలు రీఓపెన్ కాకుండా కాలపరిమితిలోగా అర్జీలను నిశితంగా పరిశీలించి పరిష్కారం చూపాలన్నారు. . అర్హులైన పేదలకు రేషన్ కార్డులు మంజూరు చేయాలన్నారు. పిఓఎల్ఆర్, రీ సర్వే పనులను వేగవంతం చేయాలన్నారు.జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఇంఛార్జి డిఆర్వో మల్లికార్జునుడు, హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకట నారాయణ, తదితరులు పాల్గొన్నారు.