రెండో రోజు కొనసాగుతున్న షర్మిల దీక్ష
1 min readపల్లెవెలుగు వెబ్: వైఎస్ షర్మిల దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. తెలంగాణలో నిరుద్యోగులకు మద్దతుగా వైఎస్ షర్మిల ఉద్యోగ దీక్షకు కూర్చున్నారు. నిన్న ఇందిరాపార్క్ వద్ద దీక్షను మొదలుపెట్టారు. కానీ ఒక్కరోజే దీక్షకు అనుమతించడంతో… పోలీసులు షర్మిల దీక్షను భగ్నం చేసి.. అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఆమె వస్త్రాలు కూడ చిరిగిపోయాయి. తెలంగాణ నిరుద్యోగల కోసం 72 గంటలపాటు తన దీక్ష కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. రెండో రోజు వైఎస్ షర్మిల నివాసం.. లోటస్ పాండ్ వద్ద ఆమె దీక్ష కొనసాగుతోంది. ప్రాణం పోయినా సరే దీక్ష విరమించేది లేదని ఆమె స్పష్టం చేశారు. వైఎస్ షర్మిలకు మద్దతుగా ఆమె తల్లి విజయమ్మ కూడ దీక్షలో పాల్గొన్నారు. జులై 8న తెలంగాణలో పార్టీ ప్రకటిస్తున్నట్టు ఇప్పటికే షర్మిల స్పష్టం చేశారు. అనంతరం ఆమె పాదయాత్ర చేసే అవకాశాలు ఉన్నాయని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.