వివేకా హత్య కేసులో సంచలన లేఖ
1 min readపల్లెవెలుగు వెబ్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ డైరెక్టర్ కు సంచలన లేఖ రాశారు మాజీ ఏపీ ఇంటెలెజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు . వివేకా హత్య సమయంలో ఏబీ వెంకటేశ్వరరావు ఇంటిలిజెన్స్ చీఫ్ గా ఉన్నారు. హత్య జరిగిన చాలా సేపటి వరకు ఎవరినీ ఆ ప్రదేశంలోకి అనుమతించలేదు. కావాలనే పోలీసులను కొందరు ప్రజాప్రతినిధులు అడ్డుకున్నారు అని ఆయన లేఖలో పేర్కొన్నారు. వివేక హత్యకు సంబంధించి సీబీఐ దర్యాప్తు మొదలై .. ఏడాది గడిచిన ఇంత వరకు ఎలాంటి సమాచారం రాబట్టలేదని ఆయన తెలిపారు. అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న సందర్భంగా తన వద్ద ఉన్న సమాచారాన్ని ఫోన్ చేసి రెండు సార్లు సీబీఐ అధికారులకు చెప్పినా.. పట్టించుకోలేదని ఆయన లేఖలో పేర్కొన్నారు. వివేక హత్యను కొందరు ఎంపీలు గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఆయన తెలిపారు. హత్య జరిగిన తర్వాత ..ఇల్లు కడిగి మృతదేహాన్ని ఆస్పత్రికి తీసుకెళ్లే వరకు ఎంపీ అవినాష్ రెడ్డి తన ఆధీనం ఉంచుకున్నాడని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఆ సమయంలో వివేకా ఇంటిలోకి మీడియా , పోలీసులు, ఇంటెలిజెన్స్ సిబ్బందిని కూడ అనుమతించలేదని సీబీఐ డైరెక్టర్ కు రాసిన లేఖలో ఏబీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.