గొడిగనూరులో తప్పిన అగ్ని ప్రమాదం
1 min readచాగలమర్రి: మండల పరిధిలోని గొడిగనూరు గ్రామం శివారులోని ప్రకృతి సంపద కేంద్రం సమీపంలో ప్రమాదవశాత్తు సమీప గడ్డి వాముల వద్ద గల చెత్త కుప్పలు నుంచి ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి.విషయం తెలుసుకున్న ఆళ్లగడ్డ అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వేయడంతో భారీ అగ్ని ప్రమాదం తప్పింది. సకాలంలో మండల వైఎస్ఆర్ సీపీ నాయకులు, ఎంపీటీసీ పత్తినారాయణ, గ్రామ సర్పంచ్ సంజీవ రాయుడు స్పందించి ఆళ్లగడ్డ అగ్నిమాపక స్టేషన్ కు ఫోన్ చేయడంతో సిబ్బంది మంటలు ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది.