అర్ధనగ్నంగా ధర్నా చేసిన నటి !
1 min readపల్లెవెలుగువెబ్ : ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఆర్ట్స్ కార్యాలయం ఎదుట నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సునీత బోయ ధర్నాకు దిగింది. జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ – 45లో ఉన్న గీతా ఆర్ట్స్ ముందు అర్ధ నగ్నంగా ధర్నా చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెను సముదాయించి మహిళా పోలీసులు దుస్తులు వేయించారు. అనంతరం సునీతను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ సమయంలో ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. గీతా ఆర్ట్స్ నుంచి తనకు డబ్బులు రావాలని, ఎన్నిసార్లు అడిగినా డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో ఈ ధర్నాకు దిగినట్టు వెల్లడించింది.