ఇక నుంచి మనుషుల్లాగే.. మొక్కలు కూడ నీటిని అడుగుతాయి !
1 min readపల్లెవెలుగువెబ్ : మొక్కలు ఇప్పుడు తమకు కావాల్సిన నీటిని అడుగుతుయి. శాస్త్రవేత్తలు మొక్కల కోసం ఒక ప్రత్యేక స్మార్ట్ వాచ్‌ను అభివృద్ధి చేశారు. ఇది ఆకుల ద్వారా ఆ మొక్కకు నీరు అవసరమోకాదో తెలియజేస్తుంది. మొక్కకు నీటి కొరత లేకుండా ఉండేలా ఈ స్మార్ట్‌వాచ్ సూచనలు అందజేస్తుంది. బ్రెజిల్‌లోని బ్రెజిలియన్ నానోటెక్నాలజీ నేషనల్ లాబొరేటరీ శాస్త్రవేత్తలు దీనిని అభివృద్ధి చేశారు. డెయిలీ మెయిల్ నివేదిక తెలిపిన వివరాల ప్రకారం ఈ స్మార్ట్‌వాచ్ మొక్కలలో నీటి మట్టం ఎంత ఉందో గుర్తిస్తుంది. మొక్కలోని నీటి స్థాయిని గుర్తించేందుకు ఆకులకు సెన్సార్‌ని అమర్చారు. ఈ సెన్సార్ దానిలోని తేమ స్థాయిని తనిఖీ చేస్తుంది. అది ఇచ్చిన సమాచారానికి అనుగుణంగా మొక్కలను సంరక్షించవచ్చు.