పారిపోయిన శ్రీలంక ప్రధాని ?!
1 min readపల్లెవెలుగువెబ్ : శ్రీలంక ప్రధానిగా రాజీనామా చేసిన మహింద రాజపక్సే అధికారిక నివాసం నుంచి పారిపోయినట్టు తెలుస్తోంది. ట్రిన్కోమలీలోని నేవీ బేస్‌లో మాజీ ప్రధాని రాజపక్స ఆయన కుటుంబం తలదాచుకున్నట్లు సమాచారం. హెలికాఫ్టర్‌లో కొలంబో నుంచి రాజపక్స, ఆయన కుటుంబం ఆ నేవీ బేస్‌కు చేరుకున్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. రాజపక్స కుటుంబంతో సహా హెలికాఫ్టర్‌లో వెళుతున్న దృశ్యాలు కూడా లంక మీడియాలో ప్రసారం కావడంతో ఆయన వెళ్లిపోయిన విషయం నిజమేనని స్థానిక మీడియా ధ్రువీకరిస్తోంది. రాజపక్స ప్రస్తుతం కుటుంబంతో సహా బస చేస్తున్న ఆ నేవీ బేస్ కొలంబో నగరానికి 270 కిలోమీటర్ల దూరంలో ఉంది. అధికారిక నివాసం ఖాళీ చేసి నేవీ బేస్‌లో రాజపక్స తలదాచుకున్న వార్తలు రాగానే ఆ నేవీ బేస్‌కు సమీప ప్రాంతాల్లోని ఆందోళనకారులు అక్కడ కూడా నిరసనలకు దిగినట్లు తెలిసింది.