అన్ని ఆధారాలతోనే అరెస్ట్ చేశాం !
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీలో టెన్త్ ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంలో మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణ ఉన్నాడని ప్రాథమిక ఆధారాలు ఉన్న తర్వాతే ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిందని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. నారాయణ అరెస్ట్‌పై టీడీపీ చేస్తున్న రాద్దాంతాన్ని అంబటి రాంబాబు తీవ్రంగా ఖండించారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు.. ఆధారాలతో సహా అరెస్ట్ చేస్తే దీనిపై టీడీపీ గందరగోళం ఏమిటో అర్థం కావడం లేదని మండిపడ్డారు.