బలపడిన `అసని`.. కోస్తాలో భారీ వర్షాలు
1 min readపల్లెవెలుగువెబ్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను బలహీనపడింది. తీవ్ర తుపాను నుంచి తుపానుగా బలహీనపడినట్లుగా వాతావరణశాఖ పేర్కొంది. రేపు ఉదయానికి వాయుగుండంగా బలహీనపడనున్నట్లుగా వెల్లడించింది. మరికొన్ని గంటల్లో ఏపీ తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం చేరుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అనూహ్యంగా దిశ మార్చుకున్న అసని ఈశాన్యం వైపు కదులుతున్నట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. అసని ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురవనున్నాయి. తీరం వెంబడి గంటకు 85 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ప్రకటించారు. గరిష్టంగా 110 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని అంచనా.