PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కొన‌సాగుతున్న అనిశ్చితి.. న‌ష్టాల్లో స్టాక్ మార్కెట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : భార‌త స్టాక్‌ మార్కెట్‌లో అనిశ్చిత్తి నెలకొంది. దేశీ సూచీలు ఉదయం లాభాలతో ఆరంభమైనా ఆ వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. మార్కెట్‌ను ఉత్తేజ పరిచే పరిణామాలేవీ అంతర్జాతీయ, దేశీయంగా చోటు చేసుకోకపోవడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ రోజు ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 54,544 పాయింట్లలో లాభాలతో ఆరంభమైంది. ఆ తర్వాత 54,598 పాయింట్లను టచ్‌ చేసింది. ఉదయం 10:20 గంటల సమయంలో 293 పాయింట్లు నష్టపోయి 54,071 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నష్టాలు ఇలాగే కొనసాగితే సెన్సెక్స్‌ 53 వేల దిగువకు పడిపోయేందుకు ఆస్కారం ఉంది. ఇదే తరహాలో నిఫ్టీ 61 పాయింట్లు నష్టపోయి 16,178 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది.

                                       

About Author