NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాజ‌ద్రోహం చ‌ట్టం పై `సుప్రీం` స్టే

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రాజద్రోహం చట్టం 124A అమలుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఎలాంటి కేసులు నమోదు చేయవద్దని ఆదేశించింది. అంతే కాదు.. ఇప్పటికే నమోదైన కేసులపై చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది. మానవ హక్కులు, దేశ సమగ్రత మధ్య సమతూల్యతను పాటించాల్సిన అవసరం కూడా ఉందని సీజేఐ ధర్మాసనం అభిప్రాయపడింది. 124A సెక్షన్ కింద జైల్లో ఉన్నవారు సంబంధిత కోర్టులను ఆశ్రయించవచ్చునని సూచించింది.

                                          

About Author