దేశంలో 19 శాతం మందికి టాయిలెట్ లేదు !
1 min readపల్లెవెలుగువెబ్ : దేశంలో 19 శాతం మందికి టాయిలెట్ సౌకర్యం లేదని జాతీయ కుటుంబ ఆరోగ్య నివేదిక తెలిపింది. 2019-21లో నిర్వహించిన సర్వేను ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. టాయిలెట్ల సౌకర్యం లేకనే వీరంతా బహిరంగంగా మలమూత్ర విసర్జన చేస్తారని నివేదిక తెలిపింది. 2015-16లో టాయిలెట్ సౌకర్యాన్ని ఉపయోగించని వారి శాతం 39గా ఉండేది. బీహార్‌లో అత్యధికంగా 62 శాతం, జార్ఖండ్‌లో 70 శాతం, ఒడిశాలో 71 శాతం మందికి టాయిలెట్ల సౌకర్యం లేదని నివేదికలో వెల్లడించారు. దేశంలో పట్టణ వాసులు 11 శాతం మంది కామన్ టాయిలెట్లను ఉపయోగించుకుంటున్నారని, అదే గ్రామీణ ప్రాంతాల్లో 7 శాతం ఉపయోగించుకుంటున్నారని నివేదిక తెలిపింది. భారత్ బహిరంగ మలమూత్ర విసర్జన రహిత దేశంగా మారిందని కేంద్రం 2019లోనే ప్రకటించింది.