ఐదో రోజు నష్టాలే.. !
1 min readపల్లెవెలుగువెబ్ : దేశీయ మార్కెట్లు వరుసగా గురువారం కూడా తీవ్ర నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1158 పాయింట్లు నష్టపోయి 52,930.31 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 359 పాయింట్లు నష్టపోయి 15,808 పాయింట్ల వద్ద ముగిసింది. దీంతో దేశీయ సూచీలు 2 నెలల కనిష్ఠానికి దిగజారినట్టయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు 2-3 శాతం వరకు దిగజారాయి. నిఫ్టీ50 పతనంలో ఈ షేర్ల భాగస్వామ్యం అధికంగా ఉంది. కాగా అత్యధికంగా అదానీ పోర్ట్స్ 6 శాతం వరకు క్షీణించింది. గ్లోబల్ మార్కెట్ల సంకేతాలు ప్రతికూలంగా ఉండడంతోపాటు దేశీయంగా ద్రవ్యోల్బణానికి సంబంధించిన డేటాపై మదుపర్లు దృష్టిసారించడం మార్కెట్ల పతనానికి కారణమైంది.