వీరబల్లికి తొలిసారిగా రేపు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాక
1 min read
పల్లెవెలుగు అన్నమయ్య జిల్లా : ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలానికి రానున్నారు. ఇటీవల మంత్రివర్గ విస్తరణలో భాగంగా జగనన్న ప్రభుత్వంలో మంత్రిగా రెండవ సారిబాధ్యతలు చేపట్టి తొలిసారిగా రేపు వీరబల్లి మండలానికి వస్తున్నట్లు వీరబల్లి మండల ఎం పి పి గాలివీటి రాజేంద్రనాధ్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా సచివాలయం ప్రారంభోత్సవం మరియు గడప గడపకు వై ఎస్ ఆర్ పార్టీ తదితర కార్యక్రమాలలో పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజలు పాల్గొని తమ సమస్యలు మంత్రి గారి దృష్టికి తీసుకురావాలని ఎం పి పి ఒక ప్రకటనలో తెలిపారు.