NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీ.. జైలుకు మ‌రో ఐఏఎస్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి వీధి వ్యాపారులను ఖాళీ చేయించిన వ్యవహారంలో జీవీఎంసీ పూర్వకమిషనర్‌ ఎం. హరినారాయణ్‌కు హైకోర్టు జైలు శిక్ష విధించింది. మూడు నెలల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.2,000 జరిమానా విధించింది. వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న న్యూపోర్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ సోమశేఖర్‌, గాజువాక మాజీ ఎమ్మెల్యే పి. శ్రీనివాస్ పై కోర్టు ధిక్కరణ కేసు మూసివేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ఇటీవల తీర్పు ఇచ్చారు. హరినారాయణ తరఫు న్యాయవాది అభ్యర్థన మేరకు అప్పీల్‌ వేసుకొనేందుకు వీలుగా తీర్పు అమలును ఆరు వారాలు సస్పెండ్‌ చేశారు. అప్పీల్‌ దాఖలు చేయడంలో విఫలమైనా, అప్పీల్‌పై ధర్మాసనం స్టే విధించకపోయినా జూన్‌ 16న సాయంత్రం 5 గంటలులోగా రిజిస్ట్రార్‌ ముందు సరెండర్‌ కావాలని ఎం.హరినారాయణ్‌ను ఆదేశించారు.

                                 

About Author