NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

లోకేష్ ట్వీట్ పై పెద్దిరెడ్డి ఫైర్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిని పుంగ‌నూరు వీర‌ప్పన్ అంటూ నారా లోకేష్ త‌న ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఎర్రచంద‌నం దుంగ‌లు స్మగ్లింగ్ చేస్తున్నార‌ని ఆరోపించారు. తిరుప‌తి ఉపఎన్నిక‌ల్లో త‌న ముఠాను దించి దొంగ ఓట్లు వేయిస్తున్నార‌ని ఆరోపించారు. నారాలోకేష్ ట్వీట్ మీద పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి స్పందించారు. నారా లోకేష్ నోటికి ఏది వ‌స్తే అది మాట్లాడ‌టం స‌రికాద‌న్నారు. మాజీ సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డితో క‌లిసి తెదేపా వాళ్లే ఎర్రచంద‌నం స్మగ్లింగ్ చేశార‌ని ఆరోపించారు. ఎవ‌రికి ప్రజా బలం ఉందో ఫ‌లితాల్లో తేలుతుంద‌ని అన్నారు. దొంగ ఓట్లు వేసిన‌ట్టు నిరూపిస్తే రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటాన‌ని అన్నారు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకార‌మే టీడీపీ వాళ్లు మాట్లాడుతున్నార‌ని అన్నారు.

About Author