PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అతిగా యాంటీబ‌యాటిక్స్ వాడితే ఏమ‌వుతుందో తెలుసా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అతిగా యాంటీబయాటిక్స్‌ వాడితే రోగనిరోధవ్యవస్థలో లోపాలు ఏర్పడతాయని, దీంతో ప్రమాదకరమైన ఫంగల్‌ వ్యాధులు సోకే ప్రమాదం పెరుగుతుందని తాజాగా మరో నూతన అధ్యయనం వెల్లడించింది. చిన్నపాటి వ్యాధి నుంచి ప్రమాదకరమైన ఇన్వాసివ్‌ కాండిడియాసిస్‌ సోకేందుకు కాండిడా అనే ఫంగస్‌ కారణం. ఈ ఫంగస్‌ సోకేందుకు యాంటీ బయాటిక్స్‌ అతివాడకం కూడా ఒక కారణమని యూనివర్సిటీ ఆఫ్‌ బిర్మింగ్‌హామ్‌ పరిశోధకులు గుర్తించారు. యాంటీబయాటిక్స్‌ను ఎక్కువగా వాడితే జీర్ణవాహికలోని ప్రయోజనకరమైన బాక్టీరియా(ప్రొబయాటిక్స్‌) నశిస్తాయి. దీంతో ఈ బాక్టీరియా స్థానంలో జీర్ణవాహికలో జీవనం సాగించే కాండిడా వంటి ఫంగి చేరతాయని పరిశోధన వెల్లడించింది. ఇదే సమయంలో సదరు వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగినా లేదా కీమోథెరపీ లాంటి చికిత్స తీసుకున్నా జీర్ణవాహిక నుంచి ఈ ఫంగి రక్త ప్రవాహంలోకి ప్రవేశించి కాండిడియాసిస్‌ను కలిగిస్తుంది. ఐసీయూలో పేషెంట్లకు అతిగా యాంటీబయాటిక్స్‌ అందిస్తే కేథటర్‌ నుంచి కూడా ఈ ఫంగస్‌ రక్తంలోకి సోకే ప్రమాదముందని తేలింది.

                                    

About Author