రైతులకు పెట్టుబడి సాయం ఎప్పుడంటే ?
1 min readపల్లెవెలుగువెబ్ : రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. వైఎస్సార్ రైతు భరోసా కింద 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అర్హత పొందిన 50,10,275 రైతు కుటుంబాలకు తొలి విడతగా ఈ నెలలో రూ.3,758 కోట్ల పెట్టుబడి సాయం అందించనుంది. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన వేదిక పై నుంచి సోమవారం ఉదయం 10.10 గంటలకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంప్యూటర్‌లో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయనున్నారు. ప్రభుత్వం వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ కింద ఏటా మూడు విడతల్లో కలిపి రూ.13,500 పెట్టుబడి సాయం అందిస్తోంది.