సుపరిపాలనే.. ప్రభుత్వ లక్ష్యం.. : మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
1 min readపల్లెవెలుగు అన్నమయ్య జిల్లా (వీరబల్లి): సచివాలయ సముదాయము నుండి ప్రజలకు సుపరిపాలన అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం అన్నమయ్య జిల్లాలోని వీరబల్లి మండలంలోని పెద్దివీదు, వీరబల్లి గ్రామాల్లో నూతనంగా నిర్మించిన సచివాలయ సముదాయాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకతీతంగా ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలను అందించాలన్న ముఖ్య ఉదేశ్యం తోప్రతి గ్రామంలో సచివాలయం,రైతుబరోసా కేంద్రం,విలేజ్ క్లినిక్ తదితర ప్రభుత్వ కార్యాలయాలనుఒకేచోట నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతిగ్రామానికి నూతనంగా సచివాలయ సముదాయాలు నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు.ప్రజలు తమ అవసరాలకు సచివాలయ సముదాయాలలో ఒకేచోట సకాలంలో పూర్తి చేసుకొని వెళ్లవచ్చన్నారు.
పచ్చని చెట్లు ప్రగతికి మూలం
సచివాలయ సముదాయముల ప్రాంగణంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎం ఎల్ ఏ మేడా,జిల్లా పరిషత్ చైర్మన్ అకేపటి చెట్లను నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పచ్చని చెట్లు ప్రగతికి ములమన్నారు.ప్రతిఒక్కరు తమ బాధ్యతగా చెట్లు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు నియోజకవర్గ నాయకులు గాలివీటి మదన్ రెడ్డి,మండలాధ్యక్షులు గాలివీటి రాజేంద్రనాధ్ రెడ్డి యువ నాయకులు గాలివీటి వీరనాగిరెడ్డి,సర్పంచులు నాగిరెడ్డి, స్వామి,నేతి ఆంజనేయులు, గోపినాథరెడ్డి,సింగిల్ విండో అధ్యక్షుడు అమరనాథరెడ్డి,వై కా పా నాయకులు కె రవిశంకర్, మధుసూదన్ రెడ్డిప్రజలు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.