PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గేమింగ్ ఇండస్ట్రీలో క‌ల‌వ‌రం.. ఉద్యోగుల‌కు పోటు త‌ప్ప‌దా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆన్‌లైన్‌ గేమింగ్‌ ఇండస్ట్రీపై జీఎస్టీ పెంపు అంశం ఇప్పుడు గేమింగ్‌ ఇండస్ట్రీని కలవరానికి గురిచేస్తుంది. జీఎస్టీని పెంచితే.. గేమింగ్‌ ఇండస్ట్రీ నష్టపోయే ప్రమాదం ఉందని ఆ రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీ షట్‌ డౌన్‌ అయితే లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందనే అంచనా వేస్తున్నారు. జీఎస్టీ పెంపు అంశంపై సమీక్షించేందుకు మంత్రులతో కూడిన బృందాన్ని జీఎస్టీ కౌన్సిల్‌ ఏర్పాటు చేసింది. ఈ బృందం సభ్యులకు చైర్మన్‌గా కాన్రాడ్‌ సంగ్మా వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు మంత్రుల బృందం ఇప్పటికే మే 2న తొలి సమావేశం నిర్వహించింది. మే18న రెండో దఫా భేటీ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ గేమింగ్‌ పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న 18శాతం పన్నును 28శాతానికి పెంచేందుకు మంత్రుల బృందం ఏకాభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం.

                              

About Author