మహిళా లాయర్ పై ఆటవిక దాడి
1 min readపల్లెవెలుగువెబ్ : కర్ణాటకలో దారుణం జరిగింది. మహిళా న్యాయవాదిపై నడిరోడ్డులో ఒక వ్యక్తి ఆటవికంగా దాడికి దిగాడు. ఆమెను తంతూ, జుట్టు లాగుతూ కిరాకతంగా కొట్టాడు. ఇంత దాడి జరుగుతుంటే చుట్టూ ఉన్నవాళ్లు వారిని ఆపే ప్రయత్నం చేయలేదు. మొబైల్ ఫోన్లలో ఆ సంఘటనను వీడియో తీస్తూ అలాగే ఉండిపోయారు. బాధితురాలి భర్త అక్కడ ఉన్న వారిని సహాయం అడిగినా ఎవరూ స్పందించలేదు. కర్ణాటక రాష్ట్రంలోని బగల్కోట్ జిల్లా వినాయక్ నగర్లో జరిగిందీ సంఘటన. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.