అప్రమత్తంగా ఉండండి..
1 min read–ఎస్పీ ఫక్కీరప్ప
పల్లెవెలుగు వెబ్, డోన్,వెల్దుర్తి : ప్రతిఒక్కరూ మాస్కులు ధరించి.. కరోనాను తరిమి కొట్టాలని ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్ప పిలుపునిచ్చారు. శనివారం డోన్పట్టణంలో పర్యటించిన ఆయన.. ప్రజలకు మాస్కులు అందజేశారు. డీజీపీ ఆదేశాలమేరకు జిల్లాలోని 87 పోలీస్ స్టేషన్ల పరిధుల్లోని కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ… మాస్కులు పంపిణీ చేస్తున్నామన్నారు. శానిటైజర్ ఉపయోగిస్తూ.. భౌతిక దూరం పాటించాలని ఎస్పీ సూచించారు. అదేవిధంగా వెల్దుర్తి పట్టణంలో కూడా ప్రజలకు మాస్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు డోన్ డిఎస్పి నరసింహారెడ్డి ,డోన్ సిఐలు సుబ్రహ్మణ్యం , మహేశ్వరరెడ్డి, వెల్దుర్తి ఎస్ఐ పెద్దనాయుడు, సిబ్బంది ఉన్నారు.