ఇన్నేళ్ల తర్వాత.. ప్రజల దృష్టి మరల్చేందుకే వివాదాలు !
1 min read
పల్లెవెలుగువెబ్ : దేశంలో సంచలనం సృష్టించిన జ్ఞ్యానవాపి మసీదు అంశంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందించారు. దేశంలోని సమస్యలను పక్కదారి పట్టించే పనుల్లో ఇది ఒకటని, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ల తర్వాత తాజ్‌మహల్, జ్ణానవాపి, మధుర వంటి సాకులతో ప్రజలను నిజమైన సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకు కుట్రలు చేస్తున్నారని ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బుధవారం ఉత్తరప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలో బీఎస్పీ కార్యాలయంలో ఆమె మీడయాతో మాట్లాడుతూ అధికార పార్టీ బీజేపీపై విమర్శలు గుప్పించారు.