యాసిన్ మాలిక్ దోషి !
1 min readపల్లెవెలుగువెబ్ : ఉగ్రవాదానికి నిధులను సేకరించి, సమకూర్చిన కేసులో కశ్మీరు వేర్పాటువాది యాసిన్ మాలిక్ దోషి అని ఢిల్లీలోని జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక కోర్టు గురువారం తీర్పు చెప్పింది. కశ్మీరు లోయలో ఉగ్రవాదం, వేర్పాటువాద కార్యకలాపాల కేసులో తాను నేరం చేసినట్లు మాలిక్ అంగీకరించిన సంగతి తెలిసిందే. ప్రత్యేక న్యాయమూర్తి ప్రవీణ్ సింగ్ ఈ తీర్పు చెప్పారు. తదుపరి వాదనల కోసం మే 25న జరుగుతుంది. మాలిక్ ఆర్థిక పరిస్థితికి సంబంధించిన అఫిడవిట్‌ను దాఖలు చేయాలని కోర్టు ఆయనను ఆదేశించింది. ఆదాయ వనరులు, ఆస్తుల వివరాలను తెలియజేయాలని తెలిపింది. ఆయనకు విధించదగిన శిక్షను నిర్ణయించేందుకు ఆయన ఆర్థిక పరిస్థితిని మదింపు చేయాలని ఎన్ఐఏను ఆదేశించింది.