PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌ర్నూలు.. ప్రేమ పేరుతో విద్యార్థినిని తీసుకెళ్లిన లెక్చ‌ర‌ర్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప్రేమ పేరుతో ఇంటర్ విద్యార్థినిని లెక్చరర్ తీసుకెళ్లిన ఘటన బనగానపల్లెలో చోటుచేసుకుంది. బ‌న‌గాన‌ప‌ల్లెలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో లెక్చరర్ వీర కుమార్ ఇంటర్ విద్యార్థినికి ప్రేమ పేరుతో వలవేశాడు. ఇంటర్ పరీక్ష రాసి తిరిగి వస్తుండగా మాయమాటలు చెప్పి విద్యార్థినిని తీసుకెళ్లాడు. ఇంటికి రాకపోవడంతో అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు లెక్చరర్ వీరకుమార్‌పై అట్రాసిటీ, కిడ్నాప్ కేసు నమోదు చేశారు. వీర కుమార్ ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలతో గాలిస్తున్నారు.

                                      

About Author