PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

త్వ‌ర‌లో గ్రూప్ -4 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తెలంగాణలో త్వరలో గ్రూప్‌–4 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ కూడా వెలువడనుంది. గ్రూప్‌–4 కింద నిర్దేశించిన 9,168 ఖాళీల భర్తీకి ఈ నెలాఖరులోగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం. గ్రూప్‌–4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి శాఖల వారీగా ఉన్న ఖాళీలు, రోస్టర్‌ పాయింట్ల ప్రకారం పోస్టులను నిర్దేశిస్తూ ప్రతిపాదనలు తయారు చేయాల్సిందిగా సీఎస్ సోమేష్ క‌మార్ ఆదేశించారు. ఈనెల 29 నాటికి నిర్దేశించిన అన్ని ప్రభుత్వ శాఖలు ఖాళీలకు సంబంధించిన ఇండెంట్లను టీఎస్‌పీఎస్సీకి సమర్పించాలని స్పష్టం చేశారు. నిర్దేశించిన తేదీలోగా ప్రతిపాదనలను సమర్పించినట్లైతే శాఖల వారీగా ప్రతిపాదనల పరిశీలనకు టీఎస్‌పీఎస్సీ తేదీలను ఖరారు చేయనుంది.

                                   

About Author