అతివేగం.. ప్రాణం తీసింది..!
1 min readలారీ డ్రైవర్ అతివేగానికి వ్యక్తి మృతి
పల్లెవెలుగు వెబ్, ఓర్వకల్: అతి వేగంగా లారీ నడిపి ద్విచక్ర వాహనదారుడిని ఢీకొని అనంతరం కారు ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన సంఘటన మండల పరిధిలోని సోమయాజులపల్లి గ్రామ సమీపంలోని బస్ స్టాప్ వద్ద MH 12 NX 1452 నెంబర్ గల లారీ ని, దాని డ్రైవర్ షేక్ మహబూబ్ (మహారాష్ట్ర )అతి వేగముగా, అజాగ్రత్తగా,నిర్లక్షముగా నడిపి AP 39 KE 7143 నంబర్ గల బజాజ్ ప్లాటినా మోటార్ సైకిల్ ను గుద్దగా వాహనదారుడు బలపాలపల్లి మద్దిలేటి స్వామి RS రంగాపురం చెందిన వ్యక్తి,కి గాయాలు కావడం అదే లారీ AP 03 BC 7799 నెంబర్ గల హుండాయ్ i20 కార్ ను గుద్దగా లారీ యొక్క బంపర్ తగిలి కార్ డ్రైవరు దూదేకుల రంగస్వామి, రామపురం గ్రామం, అవుకు మండల వాసి తలకు బలమైన రక్త గాయము తగిలి కర్నూలు మెడికవర్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతూ, కోలుకొనలేక చనిపోయాడు. మరియు సదరు లారీ ఇంకొక MH 49 AS 9702 నెంబర్ గల కారును వెనక నుండి గుద్దినది అని చనిపోయిన వ్యక్తి దూదేకుల రంగస్వామి తండ్రి దూదేకుల బాబయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్ పై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ మల్లికార్జున తెలిపారు.