PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కాంగ్రెస్ పై పీకే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కాంగ్రెస్‌ చింతన్‌ శిబిర్‌పై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ సంచలన కామెం‍ట్స్‌ చేశారు. పీకే.. కాంగ్రెస్ చింత‌న్ శిబిర్‌పై ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందిస్తూ.. అదో విఫ‌ల చింత‌న్ శిబిర్ అంటూ సటైర్లు వేశారు. ఈ శిబిర్‌ వల్ల కాంగ్రెస్‌ పార్టీలో ఎలాంటి మార్పులు సంభవించవు. ఎప్పటిలాగే అదే పరిస్థితి ఉంటుందని ఎద్దేవా చేశారు. రాబోయే గుజ‌రాత్, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో ఓట‌మి చెందే వ‌ర‌కూ కాంగ్రెస్‌లో ఈ య‌థాతథ స్థితి ఇలాగే వుంటుంది అంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు.

                                   

About Author