ప్రాంతీయ భాషలపై మోదీ కీలక వ్యాఖ్యలు
1 min readపల్లెవెలుగువెబ్ : భాషా వైవిద్ధ్యం భారత దేశానికి గర్వకారణమని, అయితే దీనిపై వివాదాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భాషల ప్రాతిపదికపై వివాదాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతుండటం కొద్ది రోజులుగా మనం చూస్తున్నామని మోదీ చెప్పారు. ప్రతి ప్రాంతీయ భాషలోనూ భారతీయ సంస్కృతి ప్రతిబింబాన్ని బీజేపీ చూస్తోందని, అవి పూజించదగినవని పరిగణిస్తుందని చెప్పారు. భారత దేశ మెరుగైన భవిష్యత్తుకు ఇది అనుసంధానమని తెలిపారు. అన్ని ప్రాంతీయ భాషలకు జాతీయ విద్యా విధానం ప్రాధాన్యమిచ్చిందన్నారు. ప్రాంతీయ భాషల పట్ల మన నిబద్ధతకు ఇది నిదర్శనమని తెలిపారు.